![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్ 7 బ్యూటీ శోభా శెట్టి తన బాయ్ ఫ్రెండ్ యశ్వంత్ తో ఎంగేజ్మెంట్ చేసేసుకుంది. ప్రస్తుతం ఆ ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో నెగెటివిటీని ఎదుర్కొంది. హౌస్‌లో ఈమె తీరుపై ఆడియన్స్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఐతే బిగ్ బాస్ హౌస్ లో శోభా తన లవ్ ఎఫైర్ గురించి రివీల్ చేసింది. శోభాను కలవడం కోసం యశ్వంత్ బిగ్ బాస్ షో లోకి వెళ్లడంతో ఆ విషయం ఇంకా కంఫర్మ్ ఐపోయింది. బిగ్ బాస్ నుండి బయటికొచ్చాక శోభా శెట్టి శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి యశ్వంత్ ని తీసుకొచ్చి శోభాను సర్‌ప్రైజ్ చేశారు మేకర్స్.
ఆ స్టేజ్ మీదే రింగ్స్‌ను కూడా మార్చుకున్నారు వీళ్ళు. అలా స్టేజ్‌పైన వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిపోయింది. ఇప్పుడు తన యూట్యూబ్ లో ఒక వీడియో పోస్ట్ చేసింది. అందులో తన బర్త్ డే సందర్భంగా యశ్వంత్ వాళ్ళ అమ్మ బెంగళూరులోని తమ ఇంటికి వచ్చారని ఆడియన్స్ కి పరిచయం చేసింది. యశ్వంత్ తన లక్కీ గై అని చెప్పింది శోభా. అలాగే శోభా శెట్టి ఇంట్లో కొద్దీ మంది మధ్య దేవుడి పూజ చేసుకుని దండలు మార్చుకున్నారు. అలాగే శోభా శెట్టి వచ్చిన గెస్టులకు భోజనాలు వడ్డించి చివరికి యశ్వంత్ తో కలిసి భోజనం చేసింది. అలాగే శోభా ఎంగేజ్మెంట్ గెటప్ లుక్ తోనే ఒక కేక్ తయారు చేయించి తీసుకొచ్చి ఆమెతో కట్ చేయించారు. ఇక శోభాకు కాబోయే అత్తగారు ఒక వెండి వస్తువును కూడా గిఫ్ట్ కూడా ఇచ్చారు.
![]() |
![]() |